నిషేధిత ఖలిస్థాన్ జిందాబాద్(కేజెడ్ఎఫ్) ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఆధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా ఓ ఎంపీ5 సబ్-మిషన్ గన్, ఒక 9ఎంఎం తుపాకీ, ఓ కారు, నాలుగు ఫోన్లు, ఇంటర్నెట్ డాంగిల్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మఖాన్ సింగ్ గిల్ అలియాస్ అమ్లీ, దేవిందర్ సింగ్ అలియాస్ హ్యాపీగా గుర్తించారు.
ముష్కరులు... రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందన్నారు డీజీపీ దినకర్ గుప్తా. ఈ మేరకు కెనడాకు చెందిన హర్ప్రీత్ సింగ్తో సంప్రందింపులు జరిపినట్లు ప్రాథమిక విచారణ తేలిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: మరో దఫా చర్చలకు భారత్- చైనా సన్నద్ధం