ETV Bharat / bharat

ఎమ్మెల్యేలకు కరోనా- ముఖ్యమంత్రి క్వారంటైన్​ - అమరీందర్​ సింగ్​ న్యూస్​

పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అసెంబ్లీలో ఆయన్ని ​కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు తేలింది. ఈ క్రమంలో ఏడురోజుల పాటు క్వారంటైన్​లోకి వెళ్లారు సీఎం.

Punjab chief minister Capt Amarinder Singh has decided to go into 7-day self-quarantine
ఎమ్మెల్యేలకు కరోనా- ముఖ్యమంత్రి క్వారంటైన్​
author img

By

Published : Aug 28, 2020, 10:46 PM IST

పంజాబ్​లో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్​గా తేలింది. వారు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ను కలిశారు. దీంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

''పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడం వల్ల ప్రభుత్వ నిబంధనలు, వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రవీన్​​ తుక్రాల్​ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది, ఇతర అధికారులు కరోనా పరీక్షలు చేసుకొని... నెగెటివ్​ వచ్చినవారు మాత్రమే సమావేశాలకు హాజరుకావాలని మార్గదర్శకాలు జారీ చేశారు ఆ రాష్ట్ర స్పీకర్​.

ఇదీ చూడండి: పోలీసులనే బెదిరించి అరెస్టు నుంచి తప్పించుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.