ETV Bharat / bharat

'పుల్వామా అమర జవాన్ల త్యాగాలను దేశం మరువదు'

పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సైనికుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. అటు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. పుల్వామా ఘటనతో లాభపడిందెవరని ప్రశ్నించారు.

Pulwama attack anniversary
పుల్వామా అమర జవాన్ల త్యాగాలను దేశం మరవదు
author img

By

Published : Feb 14, 2020, 11:19 AM IST

Updated : Mar 1, 2020, 7:35 AM IST

పుల్వామా దాడిలో అమరులైన 40 మంది జవాన్ల త్యాగాలను దేశం ఎన్నడూ మరువదని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పుల్వామా ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు మోదీ.

దేశ సేవ, రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారు అసాధారణ వ్యక్తులని.. దేశ రక్షణలో తమ ప్రాణాలనే పణంగా పెట్టారని ట్వీట్​ చేశారు ప్రధాని.

Pulwama attack anniversary
మోదీ ట్వీట్​

లాభపడిందెవరు..

పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ నాటి ఘటన ద్వారా ఎవరు ఎక్కువగా లాభపడ్డారని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. నాటి ఉగ్రదాడిలో అమరులకు నివాళులర్పించారు. ఆ ఘటనపై విచారణలో ఏం తేల్చారని... కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్‌ ద్వారా నిలదీశారు. భద్రతాపరమైన లోపాల వల్ల జరిగిన దాడికి భాజపా ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

Pulwama attack anniversary
రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇదీ చూడండి: పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమరులకు 'స్మారక చిహ్నం'

Last Updated : Mar 1, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.