ETV Bharat / bharat

పబ్​జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?

భారత్​లో పబ్​జీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువతరం "విన్నర్​ విన్నర్​ చికెన్​ డిన్నర్" కోసం తెగ ఆరాటపడిపోతోంది. ఈ నేపథ్యంలో తెలియకుండానే ఆన్​లైన్​ గేమ్​కు బానిసగా మారిపోతోంది. కాలక్షేపం కోసం మొదలుపెడితే.. ప్రాణాలు విడిచేంతవరకు పబ్​జీ వదలడం లేదు. అసలు పబ్​జీ వల్ల ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నిజంగా ఈ ఆట జీవితాలను నాశనం చేస్తుందా?

PUBG, Scorpion for the younger generation n
పబ్​జీ.. ఇది ఆటా లేక యముడి పాశమా?
author img

By

Published : Jul 29, 2020, 4:46 PM IST

పబ్​జీ.. దేశంలో ఈ గేమ్​కు విపరీతమైన క్రేజ్​ ఉంది. ముఖ్యంగా యువతరంలో ఈ ఆన్​లైన్​ ఆట​కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పబ్​జీతో గడిపేస్తుంటారు. ఖాళీ సమయంలో ఆడదామనుకుని పబ్​జీ డౌన్​లోడ్​ చేసుకునే వారు.. కొంతకాలానికే దానికి బానిసగా మారిపోతున్నారు. తమ విలువైన సమయాన్ని ఈ ఆన్​లైన్​ గేమ్​కు బలిచేస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో పబ్​జీ ఓ సంచలనం. దీని మీద మీమ్​లూ ఎక్కువే. అదే విధంగా టీవీ ఛానళ్లలో ఈ గేమ్​పై చర్చలు కూడా జరుగుతాయి. ఆట ఎలా ఉన్నా దానికి బానిసగా మారితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నా.. పెద్దగా లాభం లేకుండా పోయింది. యువత నరనరాల్లోనూ పబ్​జీ ఇంకిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. కానీ దీని వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకున్న వారు 'వావ్'​ బదులు 'వామ్మో!' అని అనక తప్పదు.

ఇదీ చూడండి:- చైనాకు మళ్లీ ఝలక్​.. పబ్​జీ సహా 280 యాప్​లపై నిషేధం!

మొదలుపెడితే ఇక అంతే...

ఆటలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటం, ఆయుధాలతో కాల్చుకోవడం, చంపుకోవడం హింసను ప్రేరేపించే విషయాలు. పబ్​జీ వ్యసనంగా మారిన వారి విషయంలో.. పరిస్థితులు నిజంగానే దారుణంగా ఉంటున్నాయి. ఈ ఆట నేపథ్యంలో ఆత్మహత్యకు సంబంధించిన ఘటనలు పెరిగిపోవడం ఇందుకు ఓ ఉదాహరణ. అంతేకాకుండా దీని ప్రభావం మొత్తం జీవనశైలిపై పడుతోంది. వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలు నాశనమవుతున్నాయి. దీనితో వారు శారీరక, మానసిక, ఆర్థిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు.

ఇదీ చూడండి:- రాత్రంతా పబ్​జీ ఆడాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు

గేమ్​ ఆద్యంతం విద్వేషపూరిత భావాలను రేపుతుంది. దీంతో ప్లేయర్ల మానసిక స్థితి తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) 2018లోనే హెచ్చరించింది. రోజులో ఒక గంట ఆడితే ఫర్వాలేదని.. కానీ 4-6 గంటల పాటు అదే పనిగా పబ్​జీ ఆడితే శరీరానికి, మానసిక స్థితికి ఎంతో ప్రమాదకరమని స్పష్టం చేసింది.

అయితే చాలా మంది రాత్రంతా పబ్​జీ ఆడుతూనే గడిపేయడం ఆందోళన కలిగించే విషయం. దీంతో వారు రోజంతా బద్ధకంగా గడుపుతున్నారు. ఒంట్లో శక్తి తగ్గిపోతోంది. కళ్ల మంటలు, తీవ్ర తలనొప్పి వస్తాయి.

అటు ఉద్యోగులు.. ఇటు విద్యార్థులు..

ఉద్యోగంలో డెడ్​లైన్స్​ ఉంటాయి. వాటిని అందుకోవడానికి ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. గంటల తరబడి పని చేస్తూనే ఉంటారు. ఈ సమయంలో ఆటవిడుపుగా మొదలుపెట్టే పబ్​జీ.. మోయలేని భారంగా మారిపోతోంది. దీంతో డెడ్​లైన్స్​ అందుకోలేకపోతున్నారు ఉద్యోగులు. ఫలితంగా వృత్తిలో అనేక ఒతిళ్లు ఎదురవుతున్నాయి. ఈ ప్రభావం కుటుంబంపైనా పడుతోంది. ఈ పరిణామాలు కొన్నికొన్ని సార్లు భాగస్వాముల మధ్య విడాకులకు దారితీస్తున్నాయి.

ఇదీ చూడండి:- పబ్-జీ అడొద్దన్నాడని అన్ననే చంపేశాడు

విద్యార్థులపై పబ్​జీ ప్రభావం ఘోరం. 'ఇంకో గేమ్​.. ఇంకొక్క గేమ్​' అనుకుంటూ పుస్తకాలను పక్కనపెట్టేస్తున్నారు. దీంతో మార్కులు పడిపోతున్నాయి. పబ్​జీ ఆడే విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎంటర్​టైన్​మెంట్​ పేరుతో పబ్​జీ ఆడుతుంటే.. పాఠ్యాంశాలు బోరింగ్​గా మారుతున్నాయి.

'చికెన్​ డిన్నర్'​ కోసం తిప్పలు...

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి విషయం "విన్నర్​ విన్నర్​ చికెన్​ డిన్నర్​" అనే నినాదం. ఆటలో గెలిచే వారికి ఇది దక్కుతుంది. దీంతో మరింత ఉత్తేజంగా పదేపదే ఆడటం మొదలుపెడుతున్నారు. ఇందులో ఉండే ఆడియో చాట్స్​తో ఇతర ప్లేయర్లతో మాట్లాడవచ్చు. దీనితో వారందరూ సామాజికంగా యాక్టివ్​గా ఉంటున్నట్టు భావిస్తున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధం. ఆటలో గెలుపోటములు సహజం. అయితే ఈ ఆటలో గెలుపు ఇచ్చే కిక్​తో పోల్చుకుంటే ఓటమి అనంతరం కలిగే బాధ రెట్టింపు.

ఇదీ చూడండి:- పబ్​జీ ఆడుతుంటే గుండెపోటు- యువకుడి మృతి

ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్​ ఫోన్లు ఉన్నాయి. దీంతో పబ్​జీ డౌన్​లోడ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆఖరికి కూరగాయలు అమ్మేవాళ్లు కూడా ఆన్​లైన్​లో ఆడేస్తున్నారు. అంతేకాకుండా ఆటలో గెలవడానికి కావాల్సిన కొన్ని కిట్లను డబ్బులు వెచ్చించి మరీ కొనుక్కుంటున్నారు. లాక్​డౌన్​తో ఆర్థికంగా అస్తవ్యస్తమైన వారు.. డబ్బును ఈ విధంగా ఖర్చుచేయడం బాధాకరం!

---హసీనా బానో, ఐజీఎన్​ఓయూలో మాస్టర్స్​ ఆఫ్​ ఫిలాసఫీ విద్యార్థిని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.