ఉత్తర్ప్రదేశ్ బదాయూలో జరిగిన పాశవిక సామూహిక అత్యాచార ఘటనను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించారు. యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళల భద్రతపై సర్కారు ఉద్దేశాల్లో లోపాలు ఉన్నాయని ఆరోపించారు.
హాథ్రస్ ఘటనలోనూ ప్రభుత్వం బాధితులను అణచివేసి, అధికారులను వెనకేసుకొచ్చిందని అన్నారు ప్రియాంక. ఓ మీడియా కథనాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
"హాథ్రస్లో ప్రభుత్వ యంత్రాంగం బాధితులను పట్టించుకోలేదు. వారి గళాన్ని అణచివేసి.. అధికారులను కాపాడింది. బదాయూలో కూడా స్టేషన్ అధికారి బాధితుల అభ్యర్థనను వినిపించుకోలేదు. ఘటన జరిగిన ప్రాంతానికీ వెళ్లలేదు."
-ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
గుడికి వెళ్లిన యాభై ఏళ్ల మహిళపై పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మృగాళ్లలా ప్రవర్తించారు. బాధితురాలి శరీర అవయవాలను ఛిద్రం చేశారు. ఆలయ పూజారితో పాటు మరో ఇద్దరు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి డబ్బు కోసం డిమాండ్