ఇప్పడు దేశం మొత్తం ఎగ్జిట్ పోల్సే హాట్ టాపిక్. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్... భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ రెండోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ సారీ నిరాశే మిగులుతుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు ఆడియో ద్వారా సందేశం పంపారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి కార్యకర్తలు మనస్తాపానికి గురి కావాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు ప్రియాంక. పుకార్లు నమ్మొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల వేళ నిర్దేశించిన స్ట్రాంగ్రూంలు. లెక్కింపు కేంద్రాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
"ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, పుకార్లతో నిరాశ పడకండి. మీ స్ఫూర్తిని దెబ్బతీయడానికే వాటిని రూపొందించారు. వీటన్నింటిని ఎదుర్కొని అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం. లెక్కింపు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. మీ, మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నమ్ముతున్నా. "
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
ఇదీ చూడండి: ఒకే కాన్పులో అరడజను మంది పిల్లలు