ETV Bharat / bharat

లఖ్​నవూ కాదు.. గురుగ్రామ్​కు ప్రియాంక మకాం! - Priyanka Gandhi latest news

దిల్లీలోని ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయాలని నోటీసులు అందిన నేపథ్యంలో ఆ దిశగా ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఈనెల చివరి లోపే ఇంటిని ఖాళీ చేసి.. హరియాణా గురుగ్రామ్​లోని ఇంటికి మారుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే.. ముందు నుంచి అనుకుంటున్నట్లు యూపీలోని లఖ్​నవూ కాకుండా గురుగ్రామ్​కు మారుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Priyanka Gandhi Vadra
గురుగ్రామ్​ నివాసానికి ప్రియాంక
author img

By

Published : Jul 22, 2020, 2:43 PM IST

దిల్లీ లోధిలోని 35వ నంబర్​ ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. జులై 31 లోపే ఖాళీ చేయనున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. హరియాణా గురుగ్రామ్​లోని డీఎల్​ఎఫ్​ అరాలియా సెక్టార్​ 42లోని ఇంటిలోకి మారుతున్నట్లు చెప్పాయి. కొన్ని నెలలపాటు అక్కడే ఉంటారని వెల్లడించాయి.

అయితే.. ముందు నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు ప్రియాంక మకాం మార్చుతారని అంతా అనుకున్నారు. కానీ.. హరియాణా గురుగ్రామ్​లోని ఇంటికి మారుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అప్పటి వరకు అక్కడే..

ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో 2-3 ప్రాంతాల్లో అద్దె భవనాలను చూశారని.. త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు సన్నిహితులు. అందులో సుజాన్​ సింగ్​ పార్క్​ సమీపంలోని ఓ ఇంటిని ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయని, దానికి మూడు నెలల వరకు సమయం పడుతుండగా.. అప్పటి వరకు గురుగ్రామ్​లో ఉంటారని స్పష్టం చేశారు.

ఇప్పటికే గురుగ్రామ్​లోని ఇంటికి చాలావరకు గృహోపకరణాలు, సామగ్రిని తరలించారని, అలాగే భద్రతపరమైన తనిఖీలు కూడా పూర్తయినట్లు చెప్పారు. అక్కడికి మారుతున్నట్లు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో సీఆర్​పీఎఫ్​ తనిఖీలు నిర్వహించిందన్నారు.

జులై 1న నోటీసులు..

1997లో ప్రభుత్వం దిల్లీలో కేటాయించిన నివాస గృహాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని కేంద్రం జులై 1న ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది. గతేడాది నవంబర్​లో సోనియా గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం జడ్ ​ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ వసతిని వినియోగించుకునే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'అవన్నీ అసత్యాలు- ఇల్లు ఖాళీ చేయడం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.