ETV Bharat / bharat

మోదీ కంటతడి- ఆజాద్​కు సెల్యూట్​!

రాజ్యసభలో నలుగురు సభ్యుల పదవీకాలం ముగియనున్న సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా.. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు. జమ్ముకశ్మీర్​, గుజరాత్​ సీఎంలుగా పనిచేసిన సమయంలో.. వారి మధ్య సహకారాన్ని గుర్తుచేసుకున్నారు ప్రధాని. మోదీ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన ఆజాద్​.. తాను పార్లమెంటులో ప్రతి ఒక్కరినీ మిస్​ అవుతానని ఆవేదన వ్యక్తం చేశారు.

Prime Minister turns teary eyed bidding adieu to Azad
కంటతడి పెట్టుకున్న మోదీ- ఆజాద్​కు సెల్యూట్​!
author img

By

Published : Feb 9, 2021, 4:24 PM IST

Updated : Feb 9, 2021, 5:36 PM IST

కాంగ్రెస్​ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చే వారంలో ఆజాద్​ పదవీ విరమణ చేయనున్న తరుణంలో.. ఆయనతో సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకుంటూ పార్లమెంటు ఎగువసభలో భావోద్వేగానికి లోనయ్యారు.

ఫిబ్రవరి 15న గులాం నబీ ఆజాద్‌ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సభలో జరిగిన వీడ్కోలు ప్రసంగం ఆద్యంతం ఉద్వేగపూరితంగా సాగింది.

ఆజాద్​ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశం, పార్లమెంటు గురించి కూడా ఆలోచించారని కొనియాడారు ప్రధాని.

ఆజాద్​ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

''ఆజాద్​ తర్వాత.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారోనని నేను ఆందోళన చెందుతున్నా. ఆయన పనితీరును అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన కేవలం తన పార్టీ గురించే ఆలోచించలేదు. దేశం కోసం, పార్లమెంటు కోసం పనిచేశారు. ఇది చిన్న విషయమేమీ కాదు. అంతకుమించి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

28 ఏళ్ల ఆయన అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు మోదీ. ఆజాద్​ తనకు పెద్ద అండగా ఉన్నారని ప్రశంసించారు.

'' అధికారంలో, ప్రతిపక్షంగానూ ఆయనకు అపార అనుభవం ఉంది. జీవితంలో పదవి, అధికారం వస్తుంది. పోతుంది. కానీ .. దానిని ఎలా నిర్వహించాలో ఆజాద్​ నుంచి నేర్చుకోవాలి. ఇలా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లింది. 28 ఏళ్ల అనుభవం చిన్న విషయమేమీ కాదు.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

జమ్ముకశ్మీర్​ ముఖ్యమంత్రిగా ఆజాద్​, గుజరాత్​ ముఖ్యమంత్రి మోదీ.. ఉన్న సమయంలో తమ పరస్పర సహకారం గురించి మాట్లాడారు మోదీ. జమ్ముకశ్మీర్​లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సమయంలో.. తనకు తొలుత ఫోన్​ చేసింది ఆజాదేనని అన్నారు. ఆ సమయంలో ఆజాద్​ కంటతడి పెట్టుకున్నట్లు వ్యాఖ్యానించారు.

అనంతరం.. విమానశ్రయానికి వెళ్లి మృతదేహాలను గుజరాత్​ పంపించే వరకు ఆజాద్​ అక్కడే ఉన్నారని గుర్తుచేసుకున్నారు.

గుజరాత్​ యాత్రికులపై ఉగ్రదాడి సమయంలో బాధితులను ఓదారుస్తున్న ఆజాద్​

అందుకు గర్వపడుతున్నా..

స్వాతంత్య్రం అనంతరం పాకిస్థాన్​కు వెళ్లని అదృష్టవంతుల్లో తాను కూడా ఉన్నానని అన్నారు ఆజాద్​. తాను హిందుస్థానీ ముస్లిం కావడం గర్వంగా ఉందన్నారు. రాజ్యసభలో జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం గురించి వివరిస్తూ ఆజాద్​ భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో తీవ్రవాదం అంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానంటూ చెమర్చిన కళ్లతో ఆజాద్​ కోరుకున్నారు.

వీడ్కోలు సందర్భంగా సభ్యులందరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆజాద్‌, వారందరి సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు గేట్​కీపర్​ నుంచి.. ఛాంబర్​ లోపల ఉండే వ్యక్తుల వరకూ, ఛైర్మన్​, సెక్రటేరియట్​, పార్లమెంట్​ సభ్యులందరినీ ఎంతో మిస్​ అవుతానని ఉద్వేగంతో మాట్లాడారు.

తన పదవీ విరమణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆజాద్‌ వెల్లడించారు. సభలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదని పేర్కొన్న ఆజాద్‌.. వ్యక్తిగత విషయాలను, రాజకీయాలను మోదీ ఎప్పుడూ వేరువేరుగా చూస్తారని గుర్తుచేశారు.

రాజ్యసభ ఎంపీలు గులాం నబీ ఆజాద్​, మిర్​ మొహమ్మద్​ ఫయాజ్​, షాంసెర్​ సింగ్​, నజిర్​ అహ్మెద్​ లావయ్​లు ఫిబ్రవరి 15న పదవీ విరమణ పొందనున్నారు.

ఇదీ చూడండి: అభిమాని సైకిల్ యాత్రకు సోనూసూద్​ ఫిదా

Last Updated : Feb 9, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.