ETV Bharat / bharat

నేడే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభం

మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక​ సదుపాయాన్ని కల్పించే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారభించనున్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొననున్నారు మోదీ. ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.

Prime Minister Narendra Modi to launch the financing facility of Rs. 1 lakh crore under the Agriculture Infrastructure Fund
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ప్రారంభించనున్న మోదీ
author img

By

Published : Aug 9, 2020, 5:48 AM IST

వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయడమే లక్ష్యంగా రూ. లక్ష కోట్లతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సహా దేశంలోని లక్షలాది మంది రైతులు పాల్గొననున్నారు.

ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించనున్నారు. వీటి ద్వారా పంట ఉత్పత్తులు పాడవకుండా కాపాడుకోవడం సహా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం, ప్రాసెసింగ్‌ వంటి సదుపాయాలతో గిట్టుబాటు ధరలు వస్తాయని పేర్కొంది.

పలు రుణ సంస్థల భాగస్వామ్యంతో ఈ సదుపాయాల కల్పనకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేయనుంది. ఇందుకోసం 11 ప్రభుత్వరంగ బ్యాంకులతో వ్యవసాయశాఖ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేసే వారికి 3 శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ రుణానికి హామీ ఇవ్వనుంది.

దీంతోపాటు పీఎం కిసాన్ పథకం కింద ఆరో విడత నిధులను ప్రధాని విడుదల చేయనున్నారు. 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు వేలు చొప్పున జమ చేసేలా 17వేల కోట్లు విడుదల చేయనున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.