రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యాకు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. వ్లాదివోస్టోక్ చేరుకున్న మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి జ్వెజ్దా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు.
భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో భాగంగా భారత ప్రధాని.. నేడు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పర్యటనతో భారత్- రష్యా సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం వ్లాదివోస్టోక్‌లో జరగనున్న తూర్పు దేశాల ఆర్థిక ఫోరంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మోదీ ఆ సమావేశం అనంతరం పుతిన్‌తో కలిసి జూడో ఛాంపియన్ షిప్ పోటీలను తిలకిస్తారు.