ETV Bharat / bharat

అమ్మవారికి మహిళలు ప్రతిరూపాలు: మోదీ - మోదీ ప్రసంగం

అమ్మవారికి మహిళలు ప్రతిరూపాలుగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బంగాల్​లో నవరాత్రుల పూజల ప్రారంభం సందర్భంగా వర్చువల్​గా చేపట్టిన పూజోర్​ శుబికాలో పాల్గొన్నారు. ప్రతిఒక్కరు మాస్కు ధరించి ఉత్సవాలు చేసుకోవాలని కోరారు.

Prime Minister Narendra Modi
బంగాల్​ నవరాత్రుల పూజలో ప్రధాని మోదీ
author img

By

Published : Oct 22, 2020, 1:00 PM IST

బంగాల్​లో నవరాత్రుల పూజల ప్రారంభం సందర్భంగా వర్చువల్​గా నిర్వహిస్తోన్న 'పూజోర్​ శుబికా' కార్యక్రమంలో పాల్గొని... ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానమత్రి నరేంద్ర మోదీ. దుర్గాపూజ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. ముందుగా రాష్ట్ర ప్రజలకు బెంగాళీలో శుభాకాంక్షలు తెలిపారు మోదీ. దుర్గా పూజలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు మోదీ.

మహిళలు.. మహాదుర్గ అమ్మవారికి ప్రతిరూపాలు అని పేర్కొన్నారు మోదీ. వివిధ పథకాలు, విధానాలతో మహిళల సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.

" మనం కొవిడ్​-19 మహమ్మారి సమయంలో దుర్గాపూజ ఉత్సవాలు చేసుకుంటున్నాం. ప్రజలు తక్కువ ఉన్నా... పూజలు, భక్తి అదే స్థాయిలో ఉన్నాయి. ప్రజల్లో ఆనందం, ఉత్సాహం అనంతంగా ఉన్నాయి. ఇది నిజమైన బంగాల్​. ఉత్సవాల్లో రెండు గజాల దూరం పాటిస్తూ.. మాస్కు ధరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. పండుగలు భారత దేశ బలం, ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే.. బంగాల్​లోని సంప్రదాయం, సంస్కృతిని కూడా సూచిస్తాయి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

భారీ ఏర్పాట్లు..

రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్​ బూత్​ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్​లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదీ చూడండి:'దసరా స్కెచ్'తో బంగాల్​ పీఠంపై భాజపా గురి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.