ETV Bharat / bharat

బడిలో పాఠాలు ఇంట్లో నేర్పిస్తోన్న బుడతలు! - ఉత్తర్​ ప్రదేశ్​ తాజా వార్తలు

ఆ గ్రామంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లి పాఠాలు నేర్చుకోవడమే కాదు. ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యులకూ చదువు నేర్పిస్తున్నారు. ఇందుకు ఆ పాఠశాల యాజమాన్యం మినీ యుద్ధమే చేసింది. ఈ బుడతలు పెద్దలకు ఎలా బోధిస్తున్నారో ఓ లుక్కేద్దాం రండి.

primary school children educating parents and villagers in fatehpur
బడిలో పాఠాలు ఇంట్లో నేర్పిస్తోన్న బుడతలు!
author img

By

Published : Feb 16, 2020, 6:53 AM IST

Updated : Mar 1, 2020, 12:02 PM IST

బడిలో పాఠాలు ఇంట్లో నేర్పిస్తోన్న బుడతలు!

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్​ జిల్లాలోని ఓ కుగ్రామంలో సర్వ శిక్షా అభియాన్​ కింద ఉచిత ప్రాథమిక విద్యను అందిస్తోంది ప్రభుత్వం. పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే పహ్రావాపుర్​ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మరో అడుగు ముందుకేశారు.

పాఠశాల చెప్పిన 'ఈచ్​​ వన్-​ టీచ్​​ వన్​' అనే నినాదంతో అక్కడి విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదోతరగతి విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం.. ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో చదువురాని వారికోసం ఒక గంట కేటాయించి విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులు ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకొనేందుకు ఉపాధ్యాయులు తనిఖీ చేస్తుంటారు.

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించినందుకు గానూ గతంలో ఈ పాఠశాలకు అత్యుత్తమ పాఠశాలగా అవార్డు లభించింది.

ఈ మార్పు కోసం పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం ఈ బడిలో విద్యార్థులు ప్రైవేట్​ స్కూళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. గ్రామీణ సమాజాన్ని విద్యావంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలం భదౌరియా తెలిపారు.

"పిల్లల తల్లిదండ్రులు, బంధువుల్లో ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వారికి చదువు నేర్పించడం 'ఈచ్​ వన్​ టీచ్​ వన్'​ ముఖ్య ఉద్దేశం. కేవలం పిల్లలకు నేర్పిస్తోన్న పాఠాల ద్వారానే రెండేళ్ల నుంచి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు తమ ఇంట్లో కుటుంబసభ్యులకు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులను ఇక్కడికి పిలిచి.. విద్యార్థులు ఎంత వరకు సక్రమంగా పెద్దవారికి చదువు చెప్పగల్గుతున్నారనేది సమీక్షిస్తాం."

-నీలం భదౌరియా, ప్రధానోపాధ్యాయురాలు

ఈ వినూత్న ప్రయత్నం వల్ల గ్రామస్థులకు చదువు రావడమే కాక.. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం మెరుగుపడుతోంది. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థులు, గ్రామస్థులను పాఠశాల వార్షికోత్సవం రోజున సత్కరిస్తారు.

Last Updated : Mar 1, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.