దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్న వేళ ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
"కరోనాపై నిరంతరం పోరాటం కొనసాగిస్తే తప్పక విజయం సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. ఈ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి, వారి కుటుంబాలకు ప్రమాదం ఉన్నప్పటికీ వైరస్‌పై పోరాడుతున్న వారందరికీ కృతజ్ఞతలు. పోలీసులు, భద్రతా బలగాలను ప్రజలందరూ అభినందించాలి."
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వివిధ మార్గాల్లో దేశానికి సేవ చేస్తోన్న పౌరులకు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలను ట్విట్టర్ వేదికగా అభినందించారు రాష్ట్రపతి.
ఇదీ చూడండి: 53 మంది జర్నలిస్టులకు సోకిన మహమ్మారి