మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు విఫలమైనందున రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. కోవింద్ సంతకంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అంతకుముందు గవర్నర్ సిఫార్సును కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది.
- మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
- గవర్నర్ సిఫార్సు, కేంద్ర తీర్మానానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
- రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నివేదిక పంపిన గవర్నర్
- ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మరింత సమయం కోరడంతో మారిన పరిణామాలు