మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
-
The loss of lives in a fire accident at the Serum Institute of India in Pune is distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured.
— President of India (@rashtrapatibhvn) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The loss of lives in a fire accident at the Serum Institute of India in Pune is distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured.
— President of India (@rashtrapatibhvn) January 21, 2021The loss of lives in a fire accident at the Serum Institute of India in Pune is distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured.
— President of India (@rashtrapatibhvn) January 21, 2021
మోదీ సంతాపం
ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా,' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) January 21, 2021Anguished by the loss of lives due to an unfortunate fire at the @SerumInstIndia. In this sad hour, my thoughts are with the families of those who lost their lives. I pray that those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) January 21, 2021
గురువారం మధ్యాహ్నం.. సీరం టర్మినల్ గేట్ 1 వద్ద ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అనంతరం.. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ దుర్ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సహా.. పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాహుల్ ట్వీట్..
సీరం ఇన్స్టిట్యూట్లో దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
-
While it’s distressing to learn of the tragic loss of lives in the fire incident at Serum Institute, the news of another fire is extremely worrying.
— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
My condolences to the family of the deceased. I request the state govt to provide necessary help to the victims & their families.
">While it’s distressing to learn of the tragic loss of lives in the fire incident at Serum Institute, the news of another fire is extremely worrying.
— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2021
My condolences to the family of the deceased. I request the state govt to provide necessary help to the victims & their families.While it’s distressing to learn of the tragic loss of lives in the fire incident at Serum Institute, the news of another fire is extremely worrying.
— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2021
My condolences to the family of the deceased. I request the state govt to provide necessary help to the victims & their families.
'ఈ అగ్నిప్రమాదంతో తీవ్రంగా కలత చెందాను. ఈ వార్త చాలా ఆందోళన కలిగించింది. మృతుల కుటుంబానికి నా సంతాపం. బాధిత కుటుంబసభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
'సీరం'ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి
ప్రమాదం జరిగిన సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. మంటలు చెలరేగిన ఫ్లోర్లో.. ఒప్పంద కార్మికులు పనిచేసే వారని ఆయన తెలిపారు. అయితే.. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకునేలోపే ఐదుగురు(పుణె-2, యూపీ-2, బిహార్-1) మంటల్లో సజీవ దవహనమయ్యారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రం మాత్రం సురక్షితంగానే ఉందని వెల్లడించారు పవార్. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా శుక్రవారం సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించే అవకాశముందని ఆయన చెప్పారు.
రూ.25లక్షల పరిహారం..
ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఆ సంస్థ ఛైర్మన్ అదర్ పూనావాలా.
ఇదీ చదవండి: 'సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందే.. మరో మాట లేదు'