ETV Bharat / bharat

రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళులు - అంబేడ్కర్‌ జయంతి

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ రూపశిల్పి నుంచి దేశప్రజలంతా ప్రేరణ పొందాలని, ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు.

President Kovind, PM Modi pay tributes to Ambedkar on his 129th birth anniversary
అంబేడ్కర్‌ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రామ్‌నాథ్‌ కోవింద్‌
author img

By

Published : Apr 14, 2020, 12:01 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అంబేడ్కర్‌.. న్యాయం, సమానత్వంతో సమాజం కోసం చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా రాష్ట్రపతి కొనియాడారు. దేశ ప్రజలంతా అంబేడ్కర్‌ నుంచి ప్రేరణ పొంది.. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోవింద్‌ పిలుపునిచ్చారు.

  • Tributes to Babasaheb Bhimrao Ambedkar on his birth anniversary. Our nation’s icon and Chief Architect of the Constitution, he strived for a society based on justice and equity. Let us all take inspiration from his vision and values, and resolve to imbibe his ideals in our lives.

    — President of India (@rashtrapatibhvn) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. దేశ ప్రజల తరఫున వినయపూర్వక నివాళులర్పించారు.

  • बाबासाहेब डॉ. भीमराव अम्बेडकर को उनकी जयंती पर सभी देशवासियों की ओर से विनम्र श्रद्धांजलि। #AmbedkarJayanti pic.twitter.com/ddDiD8HAe5

    — Narendra Modi (@narendramodi) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్‌పై మండిపడ్డ నడ్డా..

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా... అంబేడ్కర్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్‌ తగినంత గౌరవం ఇవ్వలేదని... ఆయన మరణించిన నాలుగు దశాబ్దాలకు భారతరత్న ఇచ్చారని ఆరోపించారు. కానీ, భాజపా ప్రణాళికాబద్ధంగా ఆయన ఆశయాలను నిజం చేస్తోందని చెప్పారు నడ్డా.

'రాజ్యాంగం, సమాజం, ఆర్థిక రంగాలలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కృషికి దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుంది. భాజపా కార్యకర్తలుగా... రాజకీయాలు, సమాజం, ఆర్థిక రంగాలలో అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఆయన ఆశయాలు మాకు ప్రేరణ కలిగిస్తాయి.'

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఆయన కలల సాకారం కోసమే...

అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆయనకు నివాళులర్పించారు. అంబేడ్కర్‌.. దళితులు, ఆదివాసులు, ఇతర అట్టడుగువర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారని ఆమె కొనియాడారు. ఆయన కలలను నెరవేర్చేందుకే 1984 లో ఇదే రోజున బీఎస్పీని స్థాపించారని అన్నారు మాయావతి.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.