ETV Bharat / bharat

లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే... - corona news in india

లాక్​డౌన్​ను ఏప్రిల్​ 30 వరకు పొడిగించాలని దాదాపు అన్ని రాష్ట్రాలు కోరాయి. మరి కేంద్రం ఎందుకు మే 3 వరకు కొనసాగించాలని నిర్ణయించింది?

The lockdown has been extended till May 3 ... why because?
లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే...!
author img

By

Published : Apr 14, 2020, 11:06 AM IST

Updated : Apr 14, 2020, 11:44 AM IST

కరోనాపై పోరుకు లాక్​డౌన్​ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది కేంద్రం. తొలి దఫాగా మార్చి 24 నుంచి ఏప్రిల్​ 14 వరకు లాక్​డౌన్​ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా వైరస్​ వ్యాప్తి అదుపులోకి రానందున... ఆంక్షలు కొనసాగించడం అనివార్యమైంది.

లాక్​డౌన్​ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది కేంద్రం. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

30 వరకే అనుకున్నా...

లాక్​డౌన్​ను ఏప్రిల్​ 30 వరకు అమలు చేయాలని దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కానీ... మే 3 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రాష్ట్రాలు కోరినదానికన్నా 3 రోజులు ఎక్కువగా లాక్​డౌన్ కొనసాగించడానికి ఓ కారణముంది.

మే 1... కార్మిక దినోత్సవం, పబ్లిక్ హాలిడే. మే 2 శనివారం, మే 3 ఆదివారం. ఈ 3 రోజులు ఎలాగో సెలవులే కాబట్టి... లాక్​డౌన్​ను అప్పటివరకు పొడిగించడమే మేలని భావించింది కేంద్రం. మొత్తంగా భారత్​ 40 రోజులు లాక్​డౌన్​లో ఉంటుంది.

ఇదీ చూడండి: మే 3 వరకు లాక్​డౌన్ పొడిగింపు​- మోదీ ప్రకటన

Last Updated : Apr 14, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.