భారత మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు.
సర్దార్ 144వ జయంతిని పురస్కరించుకుని దిల్లీలోని పటేల్ విగ్రహానికి రాష్ట్రపతి, హోంమంత్రి, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
దేశాన్ని అఖండ భారతంగా మార్చటానికి పటేల్ చేసిన కృషి మరువలేనిదని అమిత్ షా ఉద్ఘాటించారు. అప్పుడు మిగిలిపోయిన కశ్మీర్ సమస్యను ప్రస్తుతం పరిష్కరించి సర్దార్ కలను నెరవేర్చామని పేర్కొన్నారు.
"స్వాతంత్య్రానంతరం 550 స్వదేశీ సంస్థానాలను పటేల్ దేశంలో విలీనం చేశారు. కానీ ఒక ముక్క మిగిలిపోయింది... జమ్ము కశ్మీర్. భారత్‌లో విలీనమయింది కానీ.. 370, 35(ఏ) అధికరణలతో దేశానికి సమస్యగా పరిణమించింది. ఆగస్టు 5న 370, 35(ఏ) అధికరణలను భారత పార్లమెంటు చేసింది. సర్దార్ పటేల్ కలను సాకారం చేశాం. వీటిని రద్దు చేసి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలు కల్పించే మార్గాన్ని మూసివేశాం."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
అనంతరం దిల్లీలోని జాతీయ మైదానంలో రాష్ట్రీయ్ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు షా. ఇందులో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.