ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పిలుస్తోన్న కుంభమేళా మరో రికార్డుకు వేదికైంది. గురువారం 500కు పైగా బస్సుల్ని ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించారు అధికారులు. నిన్న12 నుంచి 15వేల మంది చేతి నమూనాలతో గీసిన ఈ చిత్రం అతిపెద్ద చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఈ రికార్డు ఇప్పటివరకు దక్షిణ కొరియా పేరిట ఉంది. 8 గంటల్లో 4675 మంది చేతి నమూనాలతో దక్షిణ కొరియా రికార్డు నెలకొల్పింది. 12 నుంచి 15వేల మంది యువకుల చేతులతో చిత్రాన్ని గీసి దక్షిణ కొరియా రికార్డును తిరగరాశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్రాజ్ మేళా అథారిటీ పేరిట ఈ రికార్డును అందజేసింది గిన్నిస్ సంస్థ.