ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ప్రశాంత్ నేతృత్వంలోని రాజకీయ సలహాదారు సంస్థ ఐ-ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)... తమ పార్టీకి సేవలు అందించనున్నట్లు ఆప్ సమన్వయకర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
పీకే బృందంతో కలిసి పనిచేయడం కేజ్రీవాల్ ట్వీట్‌కు ఐ-ప్యాక్ రిప్లై ఇచ్చింది. పంజాబ్‌లో తాము కాంగ్రెస్ కోసం పనిచేసిన సమయంలో ఆప్‌ను బలమైన ప్రత్యర్థి అని గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పుడు ఆప్‌తో జట్టు కట్టడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది.
70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్నాయి.
2014 నుంచి.....
స్థానిక పరిస్థితులకు తగినట్లు రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించే సంస్థగా ఐ-ప్యాక్‌కు మంచి పేరుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచార ప్రణాళికను ఈ సంస్థే రూపొందించింది. 2015లో బిహార్‌లో నీతీశ్ కుమార్, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రి కావడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
2021లో జరిగే బంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐ-ప్యాక్ పనిచేస్తోంది.
ఇదీ చూడండి:బంగాల్లో ఆరని 'పౌర' సెగలు.. నిరసనలు ఉద్ధృతం