మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన కోమాలోనే ఉన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. రక్తపోటు, గుండె పని చేసే తీరు వంటి కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయన్నారు.
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ నెల 10న ఆపరేషన్ చేశారు.
ఇదీ చూడండి: కారు ఢీకొడితే ఎగిరి బైక్ కింద పడ్డాడు.. కానీ!