సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన సవాల్ ఆయన్ను ఎటూ పాలుపోని పరిస్థితికి నెట్టేసింది. రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటున్నారంటూ మొహాలీలో సిద్ధూ చిత్రాలతో గోడ పత్రికలు వెలిశాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో అమేఠిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సిద్ధూ సవాల్ విసిరారు. అయితే ఊహించని విధంగా అమేఠిలో రాహుల్ పరాజయం పాలయ్యారు.
ఎన్నికల ప్రచారంలో సిద్ధూ చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ ప్రస్తుతం మొహాలీలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. రాజకీయాల నుంచి ఎప్పుడు తప్పుకుంటున్నారు....? మీ రాజీనామా కోసం ఎదురుచూస్తున్నామని పోస్టర్లలో రాసి ఉంది. ఈ పోస్టర్లకు సిద్ధూ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..!
- ఇదీ చూడండి: కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్