ETV Bharat / bharat

విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే! - విమాన ప్రయాణాలు ప్రారంభం

విమాన ప్రయాణాలు ప్రారంభించిన తర్వాత పాటించాల్సిన విధానాలపై పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవడం సహా ప్రయాణికులందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరని మార్గదర్శకాల్లో పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా విమానంలోని మూడు వరుసలను ఖాళీగా ఉంచాలని ఎయిర్​లైన్లకు సూచించింది.

Civil aviation ministry
పౌర విమానయాన శాఖ
author img

By

Published : May 12, 2020, 6:23 PM IST

లాక్​డౌన్ ముగిసిన అనంతరం విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రయాణాలు చేసే వారు విమాన సమయానికి రెండు గంటల ముందుగానే ఎయిర్​పోర్ట్​కు చేరుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పనిసరి అని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ప్రయాణం ప్రారంభానికి ముందు కొవిడ్-19 సంబంధిత విస్తృత ప్రశ్నావళిని ప్రయాణికులు నింపాల్సి ఉంటుంది. క్వారంటైన్ సహా కరోనాతో సంబంధం ఉన్న ఇతర విషయాలను ఇందులో తెలియజేయాల్సి ఉంటుంది. దీనితోపాటు విమానాల్లోకి క్యాబిన్ బ్యాగేజీ తీసుకురావడానికి అనుమతి ఉండదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

ప్రయాణికులను ఎయిర్​పోర్ట్​లోకి అనుమతించడానికి ఆరోగ్య సేతు యాప్​లో గ్రీన్ స్టేటస్ తప్పనిసరిగా ఉండేలా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. వెబ్ చెక్​-ఇన్, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఒకే క్యాబిన్, కాక్​పిట్ సిబ్బంది బృందాన్ని వీలైనంతవరకు కొనసాగించాలని సూచించింది.

విమానంలోని మూడు వరుసలు ఖాళీ!

ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది, విమానాశ్రయ నిర్వాహకులకు సైతం మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. ప్రవేశ ద్వారాల వద్ద ఐడెంటిటీ కార్డ్ చెకింగ్​ను రద్దు చేయాలని, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. అత్యవసర సహాయ నిమిత్తం విమానంలోని మూడు వరుసలను ఖాళీగా ఉంచాలని పేర్కొంది.

విమానయాన సంస్థలు, ఎయిర్​పోర్ట్ నిర్వాహకులతో సంప్రదించి ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇతర మార్గదర్శకాలు

  • విమానాశ్రయాల్లో అమల్లో ఉన్న నియమాల గురించి ప్రయాణికులు తెలుసుకోవాలి. భౌతిక దూరం పాటించడం సహా ఇతర ఉపరితలాలను తాకకుండా ఉండాలి.
  • బ్యాగేజీ పరిమితులతో పాటు కొవిడ్-19 ప్రశ్నావళి గురించి తెలుసుకోవాలి.
  • ఆరోగ్య సేతు యాప్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి.
  • అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా ఎయిర్​పోర్టులోకి అనుమతించని వారికి... ప్రయాణ తేదీ మార్చుకోవడానికి విమానయాన సంస్థలు వీలు కల్పించాలి.
  • ఎయిర్​పోర్ట్ టెర్మినల్ భవనంలో ఐసోలేషన్ జోన్ సహా లక్షణాలు ఉన్నవారు ఉండేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
  • ఎయిర్​పోర్ట్​ హెల్త్ ఆర్గనైజేషన్​ వద్ద తగిన సదుపాయాలు లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సహాయం అందించాలి.
  • ఎయిర్​పోర్ట్​లోని లిఫ్ట్​లు, కూర్చునే ప్రదేశాలు, రిటైల్ అవుట్​లెట్లను క్రిమిసంహారకాలతో శుభ్రం చేయాలి. ఈ ప్రాంతాల్లో డిస్టెన్స్ మార్కింగ్స్ ఏర్పాటు చేయాలి. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.