జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు మరోసారి కాల్పులు జరిపాయి. భారత భద్రతాదళాలు దాడిని ధీటుగా తిప్పికొట్టాయి.
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్థాన్ బలగాలు పూంచ్, రాజౌరీ జిల్లాల్లో మోర్టార్లతో దాడులకు పాల్పడ్డాయి. భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయి. ఈ దాడిలో చల్లాస్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నేటి ఉదయం 11 గంటల సమయంలో రాజౌరీలోని ఖేరీ సెక్టార్లో, పూంచ్‌లోని కృష్ణఘటి సెక్టార్ వద్ద పాక్ కాల్పులకు పాల్పడిందని, దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత సైనిక అధికారులు తెలిపారు.
పూంచ్‌లోని షాపూర్, కిర్నీ, కస్బా సెక్టర్లపై పాక్ బలగాలు గురువారం కూడా కాల్పులకు పాల్పడ్డాయి.
ఇదీ చూడండి: 'ఫొనిపై మోదీతో దీదీ ఫోన్లో మాట్లాడలేదు'