ETV Bharat / bharat

'ఈవీఎమ్​ ట్యాంపరింగ్' వదంతి మాత్రమే: ఈసీ - సామాజిక మాధ్యమాలు

ఈవీఎమ్​ల ట్యాంపరింగ్​ గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్​రూంల్లో పటిష్ట భద్రత నడుమ ఈవీఎమ్​లు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దర్యాప్తులో తప్పు జరిగినట్లు తేలితే... సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

'ఈవీఎమ్​ ట్యాంపరింగ్' వదంతి మాత్రమే: ఈసీ
author img

By

Published : May 21, 2019, 5:32 PM IST

స్ట్రాంగ్​రూంల్లో భద్రపరిచిన ఈవీఎమ్​లలో టాంపరింగ్​ జరిగిందని వస్తోన్న వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. పోలింగ్​లో వాడిన ఈవీఎమ్​లు అన్నీ స్ట్రాంగ్​ రూంల్లో సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈవీఎమ్​ల టాంపరింగ్​పై వస్తోన్న వార్తలు వదంతులేనని ఈసీ తెలిపింది. వీడియోల్లో కనిపిస్తోన్న ఈవీఎమ్​లు ఎన్నికల్లో వాడినవి కావని రూఢి చేసింది.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ముగిసిన తరువాత అన్ని ఈవీఎమ్​లు, వీవీప్యాట్​లు సీల్​వేసి, పటిష్ఠ భద్రత నడుమ స్ట్రాంగ్ ​రూంల్లో భద్రపరిచామని ఈసీ తెలిపింది. పోలింగ్ అధికారులతోపాటు వివిధ పార్టీల అభ్యర్థుల సమక్షంలోనే ఇదంతా నిర్వహించామని ఈసీ తెలిపింది. ఈ తతంగాన్ని అంతా వీడియోలో రికార్డ్​ చేసినట్లు వివరించింది.

ఓట్ల లెక్కింపు జరిగే వరకు సీసీటీవీ ద్వారా నిత్యం పర్యవేక్షణ జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. 24 గంటలూ కేంద్ర సాయుధ బలగాలు కాపలాగా ఉంటున్నారని, వారితో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులూ అక్కడే ఉంటున్నారని స్పష్టం చేసింది.

ఓట్ల లెక్కింపు జరిగే రోజు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్​రూంలు తెరుస్తామని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు మొదలుపెట్టే ముందు ఈవీఎమ్​ల అడ్రస్​ టాగ్​లు, సీల్స్​, సీరియల్​ నెంబర్లను పోలింగ్ ఏజెంట్లకు చూపుతామని ఈసీ వివరించింది.

ఎన్నికల ప్రకటన చేసినప్పటి నుంచి సుమారు 93 సమావేశాలు నిర్వహించిన ఈసీ ఎన్నికల నియమ నిబంధనల​ను రాజకీయ పార్టీలకు వివరించించింది. అలాగే ప్రధాన ఎన్నికల అధికారులకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, ప్రక్రియ గురించి అభ్యర్థులకు వివరించమని తెలిపామనీ స్పష్టం చేసింది.

సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వీడియో​ల్లోనివి ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎమ్​లు అయ్యుండొచ్చని ఈసీ తెలిపింది. ఈ విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని, తప్పు జరిగితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంది.

నిర్వచన్​ సదన్​లో ఈవీఎమ్ కంట్రోల్​ రూమ్​ 011-23052123 పనిచేస్తోందని, ఇది ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఈవీఎమ్​లపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తుందని ఈసీ తెలిపింది. ఇది మే 22 ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ఈవీఎంల భద్రత బాధ్యత ఈసీదే: ప్రణబ్

Badrinath (Uttarakhand), May 19 (ANI): Prime Minister Narendra Modi offered prayers at Badrinath Temple in Uttarakhand today. PM Modi is on a two-day spiritual visit to Uttarakhand. He arrived in Kedarnath yesterday, where he offered prayers at Kedarnath Temple and meditated in holy cave.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.