ETV Bharat / bharat

బిహార్​ పోరు: ప్రధాన పార్టీల అస్త్రాలివే... - బిహార్​ పోరులో ముందస్తు ప్రచార వ్యూహాలు ఎంటంటే?

బిహార్​ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల నిబంధనావళి​ అమల్లోకి రాకముందే.. పదునైన వ్యూహాలతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అవి ఏంటి? రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ.. ప్రభుత్వంపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలు ఏంటి? కాంగ్రెస్​ ఎన్నికల సన్నద్ధత ఎలా ఉంది? సీట్ల సర్దుబాటుపై అధికార జేడీయూ మిత్రపక్షం ఎల్​జేపీ ఏం అంటోంది? ప్రత్యర్థుల్ని నితీశ్​ సేన ఎలా ఎదుర్కొంటోంది?

political-parties-kick-start-campaigning-ahead-of-bihar-assembly-polls-2020
బిహార్​ పోరులో ముందస్తు ప్రచార వ్యూహాలు ఎంటంటే?
author img

By

Published : Sep 18, 2020, 5:29 PM IST

  • దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా బిహార్​ ఎందుకైంది?
  • బిహార్​కు ఐటీ కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు?
  • ఐటీ పార్కులు, సెజ్​లు ఎందుకు నిర్మించలేదు?
  • బిహార్​ నుంచే ఎక్కువ మంది వలస కార్మికులు ఎందుకు ఉన్నారు?

మూడు దఫాలు బిహార్​ సీఎంగా పని చేసి.. నాలుగోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నితీశ్​కుమార్​కు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ సంధిస్తున్న ప్రశ్నలు ఇవి.

కాంగ్రెస్​ కూడా అదే స్థాయిలో దాడి చేస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొని... విజయ తీరాలకు చేరే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అధికార జేడీయూ. ఇలాంటి వాడీవేడి ప్రశ్నలు, విమర్శలు, వ్యూహాలతో అంతకంతకూ మారుతోంది బిహార్ రాజకీయం.

అప్పుడు మిత్రులు.. ఇప్పుడు ప్రత్యర్థులు

అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిహార్​ రాజకీయాలు ప్రచార పర్వానికి చేరుకున్నాయి. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో కలిసి పోటీ చేసిన జేడీయూ, ఆర్జేడీ ఈసారి ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. తేజస్వీ యాదవ్ సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆర్జేడీ.. నితీశ్​ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. నిరుద్యోగం, అభివృద్ధి, మౌలిక వసతలు కల్పన, వలస కార్మికుల సమస్యలు లాంటి అంశాలపై విమర్శల దాడికి దిగుతోంది.

పారిశ్రామికీకరణ లేకపోవడాన్ని ప్రధాన సమస్యల్లో ఒకటిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు తేజస్వీయాదవ్​.

వర్చువల్​గా కాంగ్రెస్​

బిహార్​ రివల్యూషన్​ మాస్​ కాన్ఫరెన్స్ పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్​. వర్చువల్​గా సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతోంది. ప్రచారంలో భాగంగా ఇటీవల సమస్తిపుర్​లో సమావేశం నిర్వహించింది. నిరుద్యోగ సమస్యే ప్రధానాంశంగా బిహార్​ కాంగ్రెస్​ చీఫ్​ శక్తి సింగ్ గోహిల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అజయ్ కపూర్, తారిక్ అన్వర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్ ప్రసంగించారు.

మరో ఐదేళ్లు ఏడవాల్సిందే..

ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఏ) కన్వీనర్, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జేడీయూ సారథ్యంలో ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలో మహాకూటమి ఏర్పడగా.. మూడో కూటమి కోసం యశ్వంత్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో నితీశ్​ ప్రభుత్వంపై మాత్రం తీవ్రస్థాయలో దాడి చేస్తున్నారు యశ్వంత్. మళ్లీ నితీశ్​ను ఎన్నుకుంటే మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోందని విరుచుకుపడుతున్నారు.

2018 వరకు భాజపాలో కీలక పదవుల్లో కొనసాగిన యశ్వంత్​.. తర్వాత ఆ పార్టీని వీడారు.

అసంతృప్తిగా మిత్రపక్షం..

జేడీయూ మిత్రపక్షమైన ఎల్​జేపీ సైతం నితీశ్​ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉంది. ఎల్​జేపీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ జేడీయూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయినా.. సీట్ల కేటాయింపు విషయంలో భాగస్వామ్యపక్షాల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్​ చేస్తున్నారు.

2019 లోక్​సభ​ ఎన్నికల్లో 6 సీట్లను ఎల్​జేపీకి కేటాయించగా.. అన్ని సీట్లలో పాసవాన్​ పార్టీ గెలిచింది. ఈసారి కూడా అలాగే గెలుస్తామని భావిస్తోంది. ఇదే విషయంపై ఇటీవల పార్టీ ఎంపీలతో చిరాగ్​ సమావేశం కూడా నిర్వహించారు. అనుకున్న సీట్లు కేటాయించకపోతే ఎన్డీఏ నుంచి బయటకు రావాలనే చర్చ సైతం ఆ సమావేశంలో జరిగినట్లు సమాచారం.

పక్కా వ్యూహంతో నితీశ్​..

విపక్షాలతో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షమూ ఇలా ముప్పేట దాడికి దిగుతున్న వేళ... ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పథకాలను ప్రచారం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ముందుకుపోతున్నారు. ఎన్నికల నిబంధనావళి​ అమల్లోకి రానందున గత నెలలో వేలాది కోట్ల రూపాయల విలువ చేసే పనులను ప్రారంభించారు. 600 కోట్ల రూపాయలతో నిర్మించే కీలక ప్రాజెక్టును బుధవారం నితీశ్​ ప్రారంభించారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మరికొన్ని కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ప్రారంభోత్సవాలు ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:బిహార్​ పోరు: నితీశ్​ 'లిక్కర్'​ అస్త్రం ఫలించేనా?

బిహార్​ బరి: పక్కా వ్యూహంతో ఎన్డీఏ-లాలూ పార్టీకి సవాళ్లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.