ETV Bharat / bharat

బిహార్​లో బరి: రెండో విడత​లో ఓటేసిన ప్రముఖులు - బిహార్ శాసనసభ ఎన్నికలు

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గవర్నర్ ఫాగూ చౌహాన్​, సీఎం నితీశ్ కుమార్​, డిప్యూటీ సీఎం సుశీల్​ మోదీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిహార్​తో పాటు మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్​లో భారీగా పాల్గొని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

political leaders voted in  bihar phase 2 elections
బిహార్​లో బరి: రెండో విడత పోలింగ్​లో ఓటేసిన ప్రముఖులు
author img

By

Published : Nov 3, 2020, 11:06 AM IST

బిహార్​లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రజలు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఉదయం 10 గంటల వరకు పోలింగ్ శాతం 8.15గా నమోదైంది. 94 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

bihar phase 2 elections
బామ్మను సైకిల్​పై పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తున్న యువతి
bihar phase 2 elections
పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు

ప్రముఖుల ఓటు..

bihar phase 2 elections
ఓటేసిన అనంతరం సీఎం నితీశ్
bihar phase 2 elections
ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వీ

బిహార్​ గవర్నర్ ఫాగూ చౌహాన్, సీఎం నితీశ్ కుమార్​, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్​ మోదీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌ వంటి ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ ఓటు శక్తితో బిహార్ ప్రజలు మార్పు తీసుకొస్తారని తేజస్వీ యాదవ్​ విశ్వాసం వ్యక్తం చేశారు.

bihar phase 2 elections
డిప్యూటీ సీఎం సుశీల్​ మోదీ
bihar phase 2 elections
ఓటేసిన చిరాగ్ పాసవాన్​

మోదీ ట్వీట్​..

బిహార్ రెండో విడత ఎన్నికల్లో ప్రజలు భారీగా పాల్గొనాలని మోదీ కోరారు. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ట్వీట్ చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని సూచించారు.

మరో 10 రాష్ట్రాల్లో..

దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్​లో 28, గుజరాత్​లో 8, ఉత్తర్​ప్రదేశ్​లో 7, ఒడిశా, నాగలాండ్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు స్థానాలకు, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

bihar phase 2 elections
మధ్యప్రదేశ్​లో ఓటింగ్
madhya pradesh by elections
మధ్యప్రదేశ్​లో ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.