బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో భారీగా ఆయుధ సామగ్రి, గంజాయి పట్టుబడింది.
గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన 50 మంది పోలీసులు ఈ ఉదయం జైలులో సోదాలు చేపట్టారు. ఓ చెట్టు కింద భూమిలో 37 పదునైన ఆయుధాలు, గంజాయి, గంజాయి సేవించేందుకు ఉపయోగించే గొట్టాలు, మొబైల్ ఫోన్, కొన్ని సిమ్ కార్డులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలతో జైళ్ల శాఖకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
![Police raid at Bengaluru prison](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4698063_bengaluru_jail_2.jpg)
![Police raid at Bengaluru prison](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4698063_bengaluru_jail_1.jpg)
![Police raid at Bengaluru prison](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4698063_bengaluru_jail.jpg)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ... అక్రమాస్తుల కేసులో ఇదే జైలు మహిళా విభాగంలో శిక్ష అనుభవిస్తున్నారు.