కుల్సుమా మృతికి పోలీసులే కారణమంటూ గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆమె మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బిడ్డ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.
అటవీ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేందుకు కార్బీ ఆంగ్లోంగ్ జిల్లా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 600పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అడ్డుపడిన గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్డీ చేశారు. నిండు గర్భిణి అని చూడకుండా బేగంపైనా బాధ్యతారహితంగా వ్యవహరించారని స్థానికులు మండిపడుతున్నారు.