కర్ణాటకలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు ఓ కానిస్టేబుల్. వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో వచ్చిన ఓ కారు పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు బలి తీసుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ట్రాఫిక్ ఉన్నతాధికారి, మరో కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ వాహానాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో బసవనగుడి నుంచి అతివేగంతో వచ్చిన కారు ఉమామహేశ్వర్ పైకి దూసుకెళ్లింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ ధనుంజయ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విహార యాత్రలో విషాదం- 23 మంది పిల్లలకు గాయాలు