ETV Bharat / bharat

"ఏప్రిల్​ నెలాఖరుకల్లా కోటి మందిని చేరుస్తాం" - పీఎంఎస్​వై

అసంఘటిత రంగ కార్మికులకు ఉద్దేశించిన 'ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్​ధన్' పథకంలో ఏప్రిల్​ నెలాఖరుకల్లా కోటి మంది చేరే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఏప్రిల్​ నెలాఖరు కల్లా కోటి మందిని చేరుస్తాం
author img

By

Published : Mar 24, 2019, 11:31 PM IST

అసంఘటిత రంగ కార్మికులు పింఛన్లు పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్​ధన్' (పీఎంసీవైఎం) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంతో లబ్ధిపొందే వారి సంఖ్య ఏప్రిల్​ నెలాఖరకు కోటి దాటే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3 వేల చొప్పున ఫించను అందిస్తారు.

"ఈ పథకంలో ఇప్పటి వరకు 25 లక్షల 36 వేల మంది సభ్యులు చేరారు. రోజుకు లక్ష మంది కార్మికులను ఇందులో భాగస్వాములు చేస్తున్నాం. ఏప్రిల్​ నెలాఖరకు కోటి మందిని చేరుస్తామనే నమ్మకం ఉంది."
- దినేష్​ త్యాగి ,సీఎస్​సీఈ - గవర్నెస్ సంస్థ ముఖ్యకార్య నిర్వాహణాధికారి.

దేశ వ్యాప్తంగా ఉన్న సీఎస్​సీ (కామన్​ సర్వీసు​ సెంటర్లు)లో దరఖాస్తులు సమర్పించి ఈ పథకంలో చేరవచ్చు.

డిసెంబర్​ నెలాఖరు నాటికి పథకంలో చేరే వారి సంఖ్య 5 కోట్లు దాటవచ్చని దినేష్​ త్యాగి తెలిపారు.

వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల మందిని పీఎంఎస్​వై పథకంలో చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు తగ్గట్టుగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది సీఎస్​సీ.

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 18- 40 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. 18 ఏళ్ల వయసు వారు నెలకు 55 రూపాయలు, 40 ఏళ్లు ఆ పైన ఉన్నవారు నెలకు 200 రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లించాలి.

అసంఘటిత రంగంలో పనిచేసే వారి వివరాల లభ్యత చాలా తక్కువ. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వారి వివరాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉత్తరప్రదేశ్​, హరియణా, మహరాష్ట్రలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.

ఇదీ చూడండీ: '2025 నాటికి క్షయ రహిత భారత్​ను నిర్మిద్దాం'

Patna (Bihar) Mar 24 (ANI): While addressing a press conference, former president of the Jawaharlal Nehru University Students Union Kanhaiya Kumar said, "On the question of protecting the nation, Indian constitution and democracy and anti BJP sect should not be divided, the country is in a state of 'undeclared emergency' we will contest election, but that does not mean that we will weaken the anti-BJP coalition that's forming across the country I will contest election form Begusarai against 'motermouth' of BJP Giriraj Singh in the interests of the people."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.