సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కోల్‌కతా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మెదీ.. నేతాజీ పూర్వీకుల నివాసం అయిన 'నేతాజీ భవన్'ను సందర్శించారు ప్రధాని. స్థానికుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. నేతాజీ మనవళ్లు కూడా మోదీకి స్వాగతం పలికి భవనం మొత్తాన్ని చూపించారు. ఈ క్రమంలో నేతాజీ వినియోగించిన కారు, ఆయన బెడ్రూంలతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన మ్యూజియంను సందర్శించారు ప్రధాని.
![PM visits Netaji's ancestral home in Kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10350771_1.jpg)
![PM visits Netaji's ancestral home in Kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10350771_3.jpg)
మోదీ వెంటే బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా ఉన్నారు.
ఆ తర్వాత నేషనల్ లైబ్రరీకి వెళ్లారు. లైబ్రరీలోని విశేషాలను అధికారులు మోదీకి వివరించారు. అనంతరం అక్కడే.. కళాకారులు, ఇతర అధికారులతో సంభాషించారు మోదీ.
![PM visits Netaji's ancestral home in Kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10350771_4.jpg)
![PM visits Netaji's ancestral home in Kolkata](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10350771_2.jpg)
ఇవీ చూడండి:-