ETV Bharat / bharat

పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్​ 17న గుజరాత్​లోని​ సర్దార్​ సరోవర్​ జలాశయాన్ని సందర్శించనున్నారు. ఆ రోజు డ్యామ్​ పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడనుంది. ఈ మైలురాయిని చూసేందుకు మోదీ వెళ్లనున్నారు.

author img

By

Published : Sep 15, 2019, 1:04 PM IST

Updated : Sep 30, 2019, 4:44 PM IST

పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ
పుట్టినరోజున 'సర్దార్'​​ డ్యామ్​కు మోదీ

గుజరాత్​ రాష్ట్రానికి జీవనాధారంగా పిలుచుకునే సర్దార్​ సరోవర్​ డ్యామ్​ ఈ నెల 17న గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోనుంది. ప్రస్తుత నీటిమట్టం 138.68 మీటర్లకు చేరుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ తెలిపారు. మరో 68 సె.మీ చేరుకుంటే పూర్తి స్థాయి నీటిమట్టం మార్క్​ను అందుకుంటుంది.

ఈ సందర్భంగా జలాశయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఆరోజు మోదీ పుట్టినరోజు కావడం మరో విశేషం.

"ఎన్నో ఏళ్ల కృషి తర్వాత నర్మదా నది పైన సర్దార్​ వల్లభాయి పటేల్​ డ్యామ్​ నిర్మాణం కల సాకారమైంది. జలాశయాన్ని నిండుకుండలా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు. అది త్వరలోనే నెరవేరనుంది." - విజయ్​ రూపానీ, గుజరాత్​ సీఎం

1961 ఏప్రిల్​ 5న దేశ తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ చేతులమీదుగా ఈ డ్యామ్​కు పునాది రాయి పడింది. అయితే ఇది పూర్తయ్యేసరికి 56 ఏళ్లు పట్టింది. గుజరాత్, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల మధ్య నర్మదా నది నీరు, విద్యుత్ పంపకాలపై ఎన్నో ఏళ్లు వివాదం నడిచింది. ఎట్టకేలకు 2017లో ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. ప్రధాని మోదీ ఈ డ్యామ్​ను జాతికి అంకితం చేశారు.

131 పట్టణ కేంద్రాలు, 9,633 గ్రామాలకు ఈ ఆనకట్ట ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది గుజరాత్​ సర్కారు. అలాగే 15 జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు నీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Shivamogga (Karnataka), Sep 15 (ANI): B Venkatagiri, an environmentalist from Karnataka's Shivamogga has preserved endangered species of over 500 herbal plants at his house and collected over 1500 varieties of seeds, considered extinct. Venkatgiri now wants to transfer his knowledge to the younger generation. "I travelled across Karnataka and collected these breeds. I have created religious method of growing herbal plants like Navagrahavana, Nandanavana, Nakshatravana, Pavitra vana, Ashwini vana with special plants mentioned in our sacred texts," he told ANI.
Last Updated : Sep 30, 2019, 4:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.