ఉత్తర్‌ప్రదేశ్‌లో నేడు పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ..
నేడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా లఖ్‌నవూలోని లోక్ భవన్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. లఖ్‌నవూ నుంచి వాజ్‌పేయీ ఐదు సార్లు 1991,1996,1998, 1999, 2004లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
అనంతరం.. అటల్ బిహారి వాజ్‌పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు మోదీ. ఈ వర్సిటీకి యూపీ ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించింది.
కట్టుదిట్టమైన భద్రత..
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆందోళనలు చెలరేగి హింసాత్మక ఘటనలకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. లఖ్నవూవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: కశ్మీర్లో బలగాల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం