ETV Bharat / bharat

లాక్​డౌన్​ ఎత్తివేతపై సీఎంలతో రేపు ప్రధాని చర్చ - ప్రధాని మోదీ

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు ఉదయం ప్రధాని మోదీ భేటీకానున్నారు. దశల వారీగా లాక్​డౌన్​ను ఎత్తివేసే విషయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే దేశంలో ఇంకా వైరస్​ విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్​డౌన్​ను పొడిగించాలని భావిస్తున్నట్టు సమాచారం.

PM to interact with CMs on Monday to discuss way out of lockdown, COVID fight
లాక్​డౌన్​ ఎత్తివేతపై ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని భేటీ
author img

By

Published : Apr 26, 2020, 4:12 PM IST

Updated : Apr 26, 2020, 4:58 PM IST

కరోనా వైరస్​పై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రేపు ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మే 3 తర్వాత దశల వారీగా లాక్​డౌన్​ను ఎత్తివేసే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం.

ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. కానీ దేశంలో వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో లాక్​డౌన్​​ పొడింగిపునకే అనేక రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇది మూడోసారి కానుంది. వైరస్​ కట్టడి కోసం మార్చి 20న తొలిసారి, లాక్​డౌన్​ పొడిగింపుపై చర్చించడానికి ఈ నెల 11న రెండో సారి ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు మోదీ.

ఇదీ చూడండి:- 'కరోనాపై యుద్ధానికి ప్రజలే సారథులు'

Last Updated : Apr 26, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.