భారత పశ్చిమ తీరం దిశగా ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను వల్ల ముప్పు పొంచి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, విజయ్ రూపానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. కేంద్రం నుంచి ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చారు. దమన్ దీవ్, దాద్రా నగర్ హవేలీ పాలకులతోనూ మోదీ మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
వేగంగా దూసుకొస్తున్న నిసర్గ తుపాను.. జూన్ 3 సాయంత్రం నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇదీ చూడండి:ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్