ETV Bharat / bharat

అవినీతి కేసుల్లో జాప్యం.. కుంభకోణాలకు పునాదే - modi news today

వంశపారంపర్య అవినీతిని నిర్మూలించాల్సిన అవసరముందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇది రాజకీయ సంస్కృతిగా మారిందన్నారు. చిన్న కేసును వదిలినా.. చుట్టుపక్కల వారికి మరింత ధైర్యాన్ని ఇస్తుందని, తప్పుచేసిన వారిని ఉపేక్షిస్తే తరువాతి తరం మరింత రెచ్చిపోతుందని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లలో అవినీతి కూడా ఒకటని తెలిపారు.

PM slams 'dynastic corruption', says it had become part of political culture in some states
వంశపారపర్య అవినీతిని నిర్మూలించాలి: మోదీ
author img

By

Published : Oct 27, 2020, 10:50 PM IST

Updated : Oct 28, 2020, 7:10 AM IST

" స్వయంసమృద్ధ భారత్‌కు అవినీతి ఓ పెద్ద అవరోధంగా మారింది. ఇప్పుడు అది ఒక్కటే మనకు సవాల్‌ విసరడం లేదు. ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధుల అందజేత వంటివన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందుకే మనం అవినీతిపై గట్టి నిఘా ఉంచాలి. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాలను పెంచుకోవాలి. అన్ని శక్తులు కూడదీసుకొని పూర్తిస్థాయి యుద్ధం చేయాలి."

-అవినీతి వ్యతిరేక సదస్సులో ప్రధాని మోదీ

దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న భారీ అవినీతి దేశానికి పెను సవాల్‌ విసురుతోందని, చెదపురుగులా పట్టి తొలిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా మారిన కుంభకోణాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమై పోయాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడకపోతే, ఆ తర్వాత వచ్చే తరం మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరించారు. నల్లధనం కూడబెట్టే వారిపై ఎలాంటి చర్యలు లేకపోయినా, చిన్న శిక్షతో సరిపెట్టినా చుట్టుపక్కలున్న వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు. మంగళవారం ప్రారంభమైన ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌’ సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

" అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక్క కేసుకే పరిమితం కాదు. అది ఒక శృంఖలాన్ని తయారుచేస్తుంది. భవిష్యత్తు కుంభకోణాలకు అది పునాది రాయిలా మారుతుంది. అక్రమార్కులపై తగిన చర్య తీసుకోకపోతే సమాజంలో నేరాలకు పాల్పడటం సాధారణమైన వ్యవహారంగా మారిపోతుంది. మన ముందున్న వ్యక్తి తప్పుడు మార్గంలో వేలకోట్ల రూపాయలు సంపాదించాడని తెలిసినా సహజంగా చూడటం ప్రారంభమవుతుంది. అది దేశ అభివృద్ధికి తీవ్ర అవరోధంగా మారుతుంది" అని మోదీ వివరించారు. "వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, డొల్ల (షెల్‌) కంపెనీల విస్తరణ, పన్ను చోరీలు ఏళ్ల తరబడి చర్చనీయాంశాలుగా నిలిచాయి. దేశం ఇలాగే నడుస్తుంది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్న ఆలోచనల్ని మార్చడం కోసం నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నల్లధనం వెలికితీతకు కమిటీ నియమించా. అవినీతిని ఏమాత్రం సహించబోమనే విధానంతో ముందడుగు వేస్తున్నాం. 2014 నుంచి ఇప్పటివరకు దేశ పరిపాలన, బ్యాంకింగ్‌, ప్రణాళిక, వైద్యం, విద్య, కార్మిక, వ్యవసాయరంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలను ఆధారంగా చేసుకొని మన దేశం స్వావలంబన సాధించే దిశగా ముందుకెళ్తోంది. భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే మా ధ్యేయం" అని మోదీ తెలిపారు.

పేదలే సమిధలు

" మొత్తం వ్యవస్థకు అవినీతే అతి పెద్ద శత్రువు. అది డబ్బుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. దానివల్ల దేశ అభివృద్ధి మందగించడంతో పాటు సామాజిక సమతౌల్యం నాశనమవుతుంది. అందు వల్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం అందరి బాధ్యత. మనం అవినీతికి వ్యతిరేకంగా గట్టి నిఘా పెట్టి సమర్థంగా తనిఖీలు నిర్వహించాలి. ప్రభుత్వ ఏజెన్సీలన్నిటి మధ్య సమన్వయం ఉండాలి. అవినీతి ప్రభావం పేదలపైనే తొలుత పడుతుంది. దశాబ్దాల తరబడి పేదలకు వారి హక్కులే లభించని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు ఆయా పథకాల ప్రయోజనం 100% చేరుతోంది. దీనివల్ల రూ.1.70 లక్ష కోట్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా నివారించగలిగాం. ఈ రోజు దేశ వ్యవస్థలపై సామాన్యుడి భరోసా మళ్లీ పెరిగింది" అని ప్రధాని వివరించారు. లంచగొండితనం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 'గత కొన్నేళ్లుగా 1,500 చట్టాలను రద్దుచేసి అనేక నిబంధనలను సరళతరం చేశాం. పింఛను, స్కాలర్‌షిప్‌, బిల్లులు, బ్యాంకు లోన్లు, పాస్‌పోర్టులు, లైసెన్సులన్నీ సరళీకరించాం. కంపెనీలు తెరవడానికి అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేశాం. ఈ పనులన్నింటికీ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు తీసుకొచ్చాం' అని తెలిపారు. ఉన్నత పదవుల్లో నియామకాల కోసం ఒత్తిళ్లు, సిఫార్సులకు మంగళంపాడినట్లు చెప్పారు. దేశంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం చట్టాలను సవరించటంతో పాటు మరికొన్ని కొత్త చట్టాలు తెచ్చామన్నారు.

దీర్ఘకాల ప్రభావం

అవినీతి ప్రభావం సుదీర్ఘ కాలం ఉంటుందని, దానికి మన బిడ్డలే బలికావాల్సి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. " ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) ఇంజినీర్‌ ఒకరు గుత్తేదారు నాసిరకంగా వంతెనలు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా డబ్బుతీసుకొని వదిలిపెట్టాడని అనుకుందాం. అతన్ని ఎవ్వరూ పట్టుకోకపోవటంతో సంతోషంగా రిటైర్‌ అయిపోయాడు. ఓ రోజు ఆ వంతెన కూలిపోయిన ప్రమాదంలో అతని యుక్తవయసు కుమారుడే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అవినీతికి ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో అప్పుడు ఆ ఇంజినీర్‌కు తెలిసి వస్తుంది. వంతెన బాధ్యతాయుతంగా నిర్మించి ఉంటే కుమారుడిని కోల్పోవాల్సి వచ్చేదికాదని అనిపిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితులను మార్చే బాధ్యత మన అందరిపై ఉంది" అని మోదీ వివరించారు.

ఇదీ చూడండి: భూ హక్కులకు కొత్త చట్టాల దన్ను

Last Updated : Oct 28, 2020, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.