ETV Bharat / bharat

అమర జవాన్లకు ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు - Venkaiah Naidu latest news

జమ్ముకశ్మీర్​- హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​లో అమరులైన జవాన్లకు ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. వారి సేవలను దేశం ఎల్లప్పుడూ మరువదని ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

PM Modi, defence minister condole death of 5 security personnel in anti-terror ops in Kashmir
వారి త్యాగాలు మరువలేం: ఎన్‌కౌంటర్‌పై ప్రధాని
author img

By

Published : May 3, 2020, 11:01 PM IST

జమ్ముకశ్మీర్​-హంద్వారాలో జరిగిన ఎన్​కౌంటర్​పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు.

PM Modi, defence minister condole death of 5 security personnel in anti-terror ops in Kashmir
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్​

"ఉగ్రవాద ఏరివేత చర్యల్లో అమరవీరులైన కల్నల్​, మేజర్​, ఇద్దరు సిబ్బందితో సహా పోలీసు బలగాల అధికారికి నివాళులు అర్పిస్తున్నా. మీ అత్యున్నత త్యాగాలు, ధైర్యాన్ని దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుంచుకుంటుంది."

- వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

'వారి త్యాగం మరువలేనిది'

హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ.. సైనికుల త్యాగం మరువలేనిదని ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించారు.

ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్​

"హంద్వారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం ఎప్పటికీ మరువలేం. దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం కోసం వారు అంకితభావంతో పనిచేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

నివాళులర్పించిన పలువురు మంత్రులు

హంద్వారా ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. మహా దళపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణె ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి కలగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు.

రాజ్​నాథ్​ సింగ్​ ట్విట్టర్​

హంద్వారాలోని ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్‌ అశుతోష్‌ శర్మ, ఓ మేజర్‌ అమరులయ్యారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. పౌరుల్ని మాత్రం భద్రతా సిబ్బంది సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: కరోనా వీరులకు సైన్యం సలాం-మోదీ, షా ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.