అయోధ్యలో ఆగస్టు 5న ప్రారంభమయ్యే రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి. ఈ కార్యక్రమంలో 150మంది ఆహ్వానితులు సహా మొత్తం 200మంది మాత్రమే పాల్గొంటారని తెలిపారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
కరోనా నేపథ్యంలో అతి తక్కువ మందితో కార్యక్రామన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు స్వామి గోవింద్ స్పష్టం చేశారు.