ETV Bharat / bharat

ఓఎల్​ఎక్స్​లో మోదీ ఆఫీస్​- నలుగురు అరెస్ట్ - modi office news

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారు నలుగురు కేటుగాళ్లు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PM Modi's Varanasi office listed on OLX for 'sale'; 4 arrested
అమ్మకానికి ప్రధాని కార్యాలయం!
author img

By

Published : Dec 18, 2020, 4:51 PM IST

వారణాసిలోని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టారు నలుగురు మోసగాళ్లు. ప్రముఖ ఆన్​లైన్ సంస్థ 'ఓఎల్​ఎక్స్​'లో అందుకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

"నిందితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయాన్ని 'ఓఎల్​ఎక్స్​'లో అమ్మేందుకు ప్రయత్నించారు. కార్యాలయానికి సంబంధించిన చిత్రంతో పాటు ప్రకటనను అందులో ఉంచారు. దీనిని గుర్తించాం. నిందితులను అదుపులోకి తీసుకున్నాం. దర్యాప్తు చేస్తున్నాం."

-అమిత్​ పాఠక్​, వారణాసి సీనియర్​ ఎస్పీ

మోదీ వరుసగా రెండుసార్లు వారణాసి లోక్​సభ స్థానం నుంచి గెలుపొందారు. భేల్​పుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని జవహర్​ నగర్​లో ఆయనకు కార్యాలయం ఉంది.

ఇదీ చూడండి: 'దణ్నం పెడతా... రైతులను తప్పుదోవ పట్టించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.