ETV Bharat / bharat

3 నగరాల్లో మోదీ పర్యటన- టీకాపై సమీక్ష

కరోనా వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. టీకా తయారీలో ముందున్న సంస్థలను సందర్శించారు. టీకా ఉత్పత్తి, పంపిణీ తదితర విషయాలపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

PM Modi visited vaccine making units in Ahmedabad, Hyderabad, Pune
టీకా టూర్: మూడు నగరాల్లో మోదీ సుడిగాలి పర్యటన
author img

By

Published : Nov 28, 2020, 7:57 PM IST

కరోనా టీకా ఉత్పత్తి, సరఫరాపై కేంద్రం కసరత్తు చేస్తున్న తరుణంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశంలోని టీకా తయారీ సంస్థలను సందర్శించారు. అహ్మదాబాద్​, హైదరాబాద్, పుణెలో సుడిగాలి పర్యటనలు చేసి టీకాపై సమీక్ష నిర్వహించారు.

తొలుత అహ్మదాబాద్​లోని జైడస్ బయోటెక్ పార్క్​ను సందర్శించారు మోదీ. చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ పరిశోధనా కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. పీపీఈ కిట్ ధరించి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్​లో కలియతిరిగారు. టీకా గురించి వారిని అడిగి సమాచారం తెలుసుకున్నారు.

జైడస్ కేంద్రంలో మోదీ సమీక్ష
  • Visited the Zydus Biotech Park in Ahmedabad to know more about the indigenous DNA based vaccine being developed by Zydus Cadila. I compliment the team behind this effort for their work. Government of India is actively working with them to support them in this journey. pic.twitter.com/ZIZy9NSY3o

    — Narendra Modi (@narendramodi) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"స్వదేశంలో తయారవుతున్న డీఎన్​ఏ ఆధారిత వ్యాక్సిన్ గురించి తెలుసుకునేందుకు అహ్మదాబాద్​లోని జైడస్ బయోటెక్ పార్క్​ను సందర్శించాను. ఈ పరిశోధనలో పాల్గొన్న బృందానికి నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి సహాయపడేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

జైడస్ హర్షం

ప్రధాని మోదీ తమ ప్లాంట్​ను సందర్శించడం పట్ల జైడస్​ క్యాడిలా సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని పర్యటన స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఇది తమ ఉద్యోగుల్లో నూతనోత్తేజం నింపుతుందని, దేశ ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు శాయశక్తులా కృషి చేసేందుకు దోహదపడుతుందని జైడస్ సంస్థ పేర్కోంది.

PM Modi to visit vaccine making units in Ahmedabad, Hyderabad, Pune today
జైడస్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మోదీ

అభివాదం

సమీక్ష అనంతరం సంస్థ కార్యాలయం వద్ద తనను చూసేందుకు గుమిగూడిన ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. దాదాపు గంటసేపు జైడస్​ ప్లాంటు వద్ద గడిపిన ఆయన ఉదయం 11.40 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్​కు పయనమయ్యారు.

అభిమానులకు అభివాదం

హైదరాబాద్

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌ చేరుకున్నారు ప్రధాని. హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకొని అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సంస్థకు వెళ్లారు. సంస్థ తయారు చేస్తోన్న 'కొవ్యాగ్జిన్' పురోగతిపై ఆరా తీశారు.

ఇదీ చదవండి- జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించిన ప్రధాని

పుణె

అనంతరం పర్యటనలో చివరి నగరమైన పుణెకు వెళ్లారు మోదీ. 4.30 గంటలకు పుణె విమానాశ్రయంలో దిగిన ఆయన.. అక్కడ ఉన్న సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించారు. కరోనా టీకా, ఉత్పత్తి, పంపిణీ ఏర్పాట్లు.. తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీరం సంస్థ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. వ్యాక్సిన్ అభివృద్ధి పనులను గురించి తెలుసుకున్నారు.

  • Had a good interaction with the team at Serum Institute of India. They shared details about their progress so far on how they plan to further ramp up vaccine manufacturing. Also took a look at their manufacturing facility. pic.twitter.com/PvL22uq0nl

"సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బృందంతో మంచి చర్చ జరిగింది. వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయడానికి వారి ప్రణాళికలను, వ్యాక్సిన్ పురోగతిపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని నాకు వివరించారు. వారి తయారీ కేంద్రాన్ని పరిశీలించాను."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సీరం సంస్థను సందర్శించిన అనంతరం దిల్లీకి తిరుగుపయనమయ్యారు మోదీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.