రామమందిర శంకుస్థాపన కోసం ఆగస్టు 5వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించనున్నారు. అయితే భూమిపూజ కార్యక్రమానికి ముందు హనుమాన్‌గఢీ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు మోదీ.
హనుమాన్‌గఢీ ఆలయంలో మోదీ నిర్వహించే పూజలు 7 నిమిషాలుంటాయని తెలుస్తోంది. ఇందులో మూడు నిమిషాల పాటు.. మోదీ ఆరోగ్యం, దేశంపై కరోనా ప్రభావం తగ్గేందుకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించనున్నారు అర్చకులు.
ఇదీ చూడండి:- రామమందిర భూమిపూజ కోసం 1,11,000 లడ్డూలు
"హనుమాన్‌గఢీలో ప్రధాని 7 నిమిషాల పాటు గడపనున్నారు. అయితే ఆయన ఏ మార్గం నుంచి ఆలయంలోకి వస్తారనేది ఆదివారం తేలుతుంది. ముందు ద్వారం వద్ద 85, వెనుక ద్వారం వద్ద 36 మెట్లు ఉన్నాయి. ప్రధాని వచ్చాక ప్రత్యేక మంత్రాలను అర్చకులు చదువుతారు. కరోనా నేపథ్యంలో కేవలం నలుగురు అర్చకులే ఉండే అవకాశముంది. అన్ని నిబంధనలను కఠినంగా పాటించాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఇందుకోసం అన్ని చర్యలు చేపట్టాం. ఎవరూ మోదీని ముట్టుకోరు, ప్రసాదం కూడా ఇవ్వరు."
-- మహంత్ రాజు దాస్, ప్రధాన అర్చకులు.
యోగి పర్యటన రద్దు...
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తలపెట్టిన శంకుస్థాపన మహోత్సవానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటిని పర్యవేక్షించేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో నేడు పర్యటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది.
ఇవీ చూడండి:-