సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అల్-సౌద్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్లో సంభాషించారు. కొవిడ్ అనంతరం.. ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జరగనున్న జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా నాయకత్వం వహించడంపై.. మోదీ అభినందనలు తెలిపారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు జీ-20 ఎజెండాపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు వివరించింది.
కరోనా కాలంలో ప్రవాస భారతీయులకు సహకరించిన సౌదీ అధికారులు, సల్మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని. భారత్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లోనూ సహాయ సహకారాల్ని మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని పీఎంఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఇదీ చదవండి: 'ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలకు ఇక్కడ బ్రేక్ పడదు'