ETV Bharat / bharat

ఆహార భద్రతకు మద్దతు ధరే కీలకం: మోదీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్​ఏఓ) 75వ వార్షికోత్సవం సందర్భంగా రూ.75 విలువగల స్మారక నాణెం విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

pm-modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Oct 16, 2020, 12:41 PM IST

Updated : Oct 16, 2020, 3:41 PM IST

దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఆహార భద్రతకు అదే ముఖ్యమని, తమ ప్రభుత్వం అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూనే దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని వివరించారు.

ప్రపంచ ఆహార దినోత్సవం రోజున ఆహారం-వ్యవసాయ సంస్థ (ఎఫ్​ఏఓ) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రూ.75 విలువగల నాణెం విడుదల చేశారు మోదీ. ప్రపంచ ఆహార సంస్థకు నోబెల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. ఆ సంస్థ విజయంలో భారత్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న మహిళల పౌష్టికాహారలోపంపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ..వారికి పౌష్టికాహారం అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చిన్నవయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం, వారికి గర్భదారణ జరిగి.. తల్లి బిడ్డ పోషకాహారలోపంతో బాధపడడాన్ని ప్రస్తావించారు. ఆడపిల్లల పెళ్లి వయస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. ఆ అంశం మీద దేశంలోని నలుమూలల నుంచి లేఖలు వస్తున్నాయని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలవుతోందని చెప్పారు.

" దేశంలోని పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అధిక పోషకాలు కలిగిన పంట రకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సహజసిద్ధంగా అభివృద్ధి చేసిన 17 రకాల పంటలను ఈ రోజు విడుదల చేశాం. అది రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది. గోధుమలు, వరి ధాన్యం కొనుగోలులో గత రికార్డులను మా ప్రభుత్వం తిరగరాసింది. కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది భారత ఆహార భద్రతకు చాలా ముఖ్యం. ఆహార వృథా అనేది పెద్ద సమస్య.. దానిని అరికట్టేందుకు అవసరమైన చట్టాల్లో మార్పులు సహా పలు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయి. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

2023 నాటికి యోగాదినోత్సవం మాదిరిగానే ప్రపంచ తృణధాన్యాలదినోత్సవాన్ని జరిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిపారు మోదీ. భారత్‌లో పండే 8 పంటలకు సంబంధించి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 17 నూతన వంగడాలను మోదీ ఆవిష్కరించారు

ఇదీ చూడండి: ఆ విషయంలో భారత్​ కన్నా పాకిస్థాన్​ భేష్​: రాహుల్​

Last Updated : Oct 16, 2020, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.