ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలిసారి దక్షిణాది రాష్ట్రానికి వచ్చారు. కేరళకు గత రాత్రి చేరుకున్న ప్రధాని.. నేడు త్రిస్సూర్‌లోని గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శించారు. గంటపాటు అక్కడే కలియతిరిగారు ప్రధాని.
తులాభారం...
కేంద్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెళుతున్న తొలి విదేశీ పర్యటనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని. అనంతరం మోదీకి తులాభారం నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులందరూ ఈ సన్నివేశాన్ని ఆసక్తితో తిలకించారు. భక్తులకు మోదీ అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు.
ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.