దేశంలోనే తొలి సీ-ప్లేన్ సేవలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేవడియాలోని సర్దార్ సరోవర్ డ్యాంకు సమీపంలోని పాండ్-3 నుంచి ఈ ట్విన్ ఇంజిన్ విమానా సేవలను జాతికి అంకితం చేశారు.
తొలి సీ-ప్లేన్ ప్రారంభం సందర్భంగా కేవడియా నుంచి సబర్మతి వరకు ప్రయాణించారు ప్రధాని మోదీ. సుమారు 40 నిమిషాల పాటు 200 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతి చేరుకున్నారు. అంతకు ముందు కేవడియాలోని నీటి విమానాశ్రయం వద్ద కొంత సమయం గడిపారు ప్రధాని. సీ-ప్లేన్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
19 మంది ప్రయాణించేందుకు వీలు కలిగిన ఈ విమానం గుజరాత్ కేవడియా సమీపంలోని ఐక్యతా విగ్రహం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి మధ్య తిరగనుంది.



ఇదీ చూడండి: 'సీ-ప్లేన్'తో పర్యటక భారతానికి సరికొత్త కళ