ETV Bharat / bharat

కరోనాపై ఎలా గెలవాలో మోదీకి చెప్పిన హైదరాబాదీ - ప్రధాని నరేంద్ర మోదీ

మనసులో మాట కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ.. కరోనాను జయించిన వారితో సంభాషించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారి జీవితం దేశప్రజల్లో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు.

PM MODI INTERACTS WITH THE CORONA VIRUS VICTIMS
వారి జీవితం ప్రజల్లో స్ఫూర్తి నింపాలి: మోదీ
author img

By

Published : Mar 29, 2020, 12:49 PM IST

Updated : Mar 29, 2020, 6:39 PM IST

కరోనా మహమ్మారిని జయించిన ఓ హైదరాబాద్​వాసితో.. 'మనసులో మాట' వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంభాషించారు. ఆయన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆ వ్యక్తి ద్వారా భరోసా ఇప్పించారు. వారిద్దరి మధ్య సంభాషణ సాగిందిలా...

మోదీ: కరోనాను జయించిన ఓ ఐటీ ఉద్యోగితో మాట్లాడి.. ఆయన అనుభవాలను తెలుసుకుందాం.

హైదరాబాద్​వాసి: నమస్తే మోదీజీ.

మోదీ: కరోనా నుంచి మీరు బయటపడ్డారని నేను విన్నా.

హైదరాబాద్​వాసి: అవునండి.

మోదీ: మీతో నేను కచ్చితంగా మాట్లాడాలనుకున్నా. మీ అనుభవాలను మీ నుంచే విందామనునుకుంటున్నా.. చెప్పండి.

హైదరాబాద్​వాసి: నేను ఓ ఐటీ ఉద్యోగి. పని మీద దుబాయ్​ వెళ్లి వచ్చా. తెలిసో తెలియకో నాకు వైరస్​ సోకింది. వచ్చిన వెంటనే.. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు బయటపడ్డాయి. 5-6 రోజుల తర్వాత వైద్యులు పరీక్షలు చేశారు. రిపోర్టులు పాజిటివ్​గా వచ్చాయి. హైదరాబాద్​లోని ప్రభుత్వాసుపత్రిలో నన్ను చేర్చారు. ఇది జరిగిన 14రోజులకు నేను కోలుకున్నా. డిశ్చార్ఛ్​ అయ్యా. అయితే ఇదంతా చూసి కొంత భయపడ్డా.

మోదీ: వైరస్​ సోకకముందే.. మీకు ఇది ఎంతో ప్రమాదమని తెలిసే ఉంటుంది. మీకు ఇలా జరిగే సరికి మీరు ఎలా స్పందించారు?

హైదరాబాద్​వాసి: మొదట్లో చాలా భయపడ్డా. అసలు నమ్మలేక పోయా. ఇలా ఎలా జరిగిందా అని చాలా ఆలోచించా. భారత్​లో 2-3 కేసులున్నా.. అప్పుడు దాని గురించి అంతగా ఏం తెలియదు. ఆసుపత్రిలో చేరాక నన్ను క్వారంటైన్​ చేశారు. మొదటి 2-3 రోజులు భయంతోనే గడిచిపోయాయి. కానీ వైద్యులు, నర్సులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ప్రతి రోజు నాతో మాట్లాడేవారు. ఏం జరగదని నాకు భరోసానిచ్చారు. ఇలా మాటలు సాగేవి. రోజులో 2,3 సార్లు వైద్యులు, నర్సులు మాట్లాడేవారు. తొలుత భయమేసినప్పటికీ... చుట్టూ ఇంతమంది మంచివాళ్లు ఉండటం వల్ల నేను కోలుకుంటా అని నమ్మకం వచ్చింది. ఏం చేయాలో వాళ్లకు తెలుసనిపించింది.

మోదీ: మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి?

హైదరాబాద్​వాసి: నేను ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులు అందరూ తీవ్ర ఒత్తడికి లోనయ్యారు. అన్నింటికన్నా ముందు.. వాళ్లకీ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్​గా తేలింది. మేము ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత రోజురోజుకు నా ఆరోగ్యం మెరుగుపడింది. వైద్యులు మాతో మాట్లాడుతూనే ఉన్నారు.

మోదీ: మీరు ఎలా అప్రమత్తమయ్యారు? మీ కుటుంబ సభ్యులను ఎలా అప్రమత్తం చేశారు.

హైదరాబాద్​వాసి: విషయం తెలిశాక నేను క్వారంటైన్​లోనే ఉన్నాను. క్వారంటైన్​ తర్వాత కూడా 14రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రి​ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లోనే ఉంటున్నా. రోజంతా నా గదిలోనే మాస్కు ధరించి ఉంటున్నా.

మోదీ: మీరు వైరస్​ను జయించారు. మీకూ.. మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు. కానీ మీరొక ఐటీ ఉద్యోగి. మీ అనుభవాలను ఓ ఆడియో టేప్​గా చేసి ప్రజలకు షేర్​ చేయండి. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేయండి. దీని వల్ల ప్రజలు భయపడకుండా ఉంటారు. వైరస్​ను నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు.

హైదరాబాద్​వాసి: అవును మోదీజీ. కానీ అందరూ.. క్వారంటైన్​ అంటే ఓ జైలులా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. క్వారంటైన్​లు మన కోసం.. మన కుటుంబసభ్యుల కోసం అని వాళ్లకు తెలియాలి. పరీక్షలు చేయించుకోండి.. క్వారంటైన్​ అనే పేరు వింటే భయపడకండి.

మోదీ: మీకు శుభాకాంక్షలు.

హైదరాబాద్​వాసి: ధన్యవాదాలు మోదీజీ.

కరోనాపై ఎలా గెలవాలో మోదీకి చెప్పిన హైదరాబాదీ

వైద్యుల సూచనలు పాటించిన హైదరాబాద్​ వాసి.. కరోనాను జయించారని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం వైరస్​ నుంచి కోలుకున్న ఆగ్రావాసితోనూ మోదీ మాట్లాడారు. ఆయన కుటుంబం మొత్తానికి వైరస్​ సోకింది. ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎలా ఎదురొన్నారని ఆ వ్యక్తిని మోదీ ప్రశ్నించారు. వైద్యులు తమను బాగా చూసుకున్నారని.. తమలో భరోసా నింపారని. అందరం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని ఆ ఆగ్రావాసి వివరించారు.

ఇలా వైరస్​ను జయించిన వారి కథలు.. దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారాలని మోదీ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:- 'మోదీజీ... బ్రిటన్​లో చిక్కుకున్నాం... రక్షించండి'

Last Updated : Mar 29, 2020, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.