ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా వివిధ అంశాలపై చర్చించారు.
రక్షణ, భద్రత, వాణిజ్యం సహా అనేక అంశాలపై ప్రధానులిద్దరూ చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం.
అంతకుముందు భారత విదేశాంగమంత్రి జయ్శంకర్తో భేటీ అయ్యారు హసీనా.
నాలుగు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని గురు, శుక్రవారాల్లో ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- ముంబయి: 2,600 వృక్షాల రక్షణకై ఆందోళనలు