ప్రాంతాలను ప్రధాని నరేంద్రమోదీ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఫొని విధ్వంసంతో జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకునేందుకు వచ్చిన ప్రధాని బృందంతోపాటు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.
ఒడిశాలో ఫొని తుఫాన్ ధాటికి 34 మంది మృత్యువాత పడ్డారు. తీరప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నది. విద్యుత్, టెలికం, నీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి.
విహంగ వీక్షణం తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని. నష్ట నివారణ, సేవల పునురుద్ధరణ వంటి విషయాలపై చర్చించారు. పర్యటనకు ముందు తుపాను బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు మోదీ.
ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక