కరోనాపై పోరులో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై ప్రసంశల జల్లు కురిపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి నిత్యం శ్రమిస్తున్న నర్సుల సేవలను ట్విట్టర్ వేదికగా కొనియాడారు మోదీ.
"భూగ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనునిత్యం అసాధారణమైన సేవలందిస్తున్న నర్సులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం(నేడు) ప్రత్యేకమైన రోజు. కరోనాను ఎదుర్కోవడానికి వారు గొప్పగా కృషి చేస్తున్నారు. ఇందుకు వారికి, వారి కుటుంబాలకు మనందరం రుణపడి ఉంటాం. అంకిత భావంతో పని చేస్తున్న నర్సుల సంక్షేమం కోసం మనం కట్టుబడి ఉండాలి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ఆమె ప్రేరణే..
ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రేరణతో కష్టపడి పని చేస్తున్న నర్సింగ్ సబ్బందిపై జాలి, దయ చూపాలని మోదీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం... ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలుగా పిలిచే ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి రోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సం జరుపుకుంటారు. ఈ ఏడాది ఆమె 200వ జయంతిని సూచిస్తుంది.
ఇదీ చూడండి: కరోనా చికిత్సలో కీలక ఘట్టానికి భారత్